నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల రోడ్లకు మహర్దశ రాబోతుందని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఊర్లలో పనుల జాతర కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శిథిలావస్థలో ఉన్న రోడ్లను రిపేర్ చేయడంతో పాటు కొత్త రోడ్లను నిర్మించి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేష్ శేట్కార్,రమేష్ చౌహన్, వినోద్ పాటిల్, తాహెర్ అలీ పాల్గొన్నారు.
భేటీ బచావో.. బేటి పడావో పోస్టర్ల ఆవిష్కరణ
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాం పేట్ మండలంలో భేటీ బచావో.. భేటీ పడావో వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. బాలల హక్కులు, చట్టాలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా,హెల్ప్ లైన్ నంబర్స్ 181,1098 గురించి తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నారన్నారు.
బాలికలకు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జడ్పీహెచ్ఎస్, అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేశ్శెట్కార్, రమేశ్చౌహాన్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, ఐకేపీ ఏపీఎం వంశీ కృష్ణ,సూపర్వైజర్ జమున, జెండర్ స్పెషలిస్ట్ విశాల, నర్సింహులు, సిబ్బంది , విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, మహిళలు పాల్గొన్నారు.